తిరుపతి కార్పొరేషన్ మేయర్‌గా శిరీష, డిప్యూటీ మేయర్‌గా నారాయణ ఎన్నికయ్యారు. వెనుకబడిన తరగతుల కులాలకు ప్రాథన్యత ఇవ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని.. తిరుమల ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలు ఆదరించడం ద్వారానే నగర పురపాలక సంస్ధల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్ధ మేయర్ పదవి జనరల్ కేటగిరీలో మహిళలకు కేటాయిచినా.. వెనుకబడిన తరగతికి చెందిన మహిళను మేయర్ చేశామన్నారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా తిరుపతి అభివృద్దికి కృషి చేస్తానని మేయర్‌గా ఎన్నికైన శిరీష తెలిపారు.
ఇదీ చదవండి: