ETV Bharat / city

TTD: వేసవి తర్వాతే సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లు: తితిదే ఈవో ధర్మారెడ్డి - తిరుమల వార్తలు

TTD: వేసవి ముగిసే వరకు భక్తుల రద్దీ నేపథ్యంలో..తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీచేయలేమని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టోకెన్ల జారీలో ఏర్పడే ఇబ్బందుల దృష్ట్యా.. వాటన్నింటినీ కూలంకషంగా అధికారులతో చర్చించి సమగ్ర విధానంలో వేసవి తర్వాత టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.

sarva darshan tokens will be issued after summer says ttd eo dharma reddy
తితిదే ఈవో ధర్మారెడ్డి
author img

By

Published : Jun 11, 2022, 8:54 AM IST

TTD: వేసవి ముగిసే వరకు భక్తుల రద్దీ నేపథ్యంలో.. సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీచేయలేమని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12 వరకు తిరుపతిలో టైమ్‌స్లాట్‌ టోకెన్లను జారీచేశామని.. అక్కడ ఏర్పడిన స్వల్ప తోపులాట అనంతరం తిరుమలకు నేరుగా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నామని తెలిపారు.

తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీలో ఏర్పడే ఇబ్బందుల దృష్ట్యా.. వాటన్నింటినీ కూలంకషంగా అధికారులతో చర్చించి సమగ్ర విధానంలో వేసవి తర్వాత టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలోనే గదులు అందుబాటులో ఉండటంతో వసతికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆగస్టు 7న రాష్ట్రవ్యాప్తంగా ‘కల్యాణమస్తు’ను ప్రారంభిస్తామని వెల్లడించారు.

మే నెలలో రూ.130.29 కోట్ల హుండీ కానుకలు.. శ్రీవారికి ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా రూ.130.29 కోట్ల హుండీ కానుకలు లభించాయని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మేలో 22.62 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. భక్తులకు శ్రీవారి లడ్డూలు కోటి 86 వేలు అందించామన్నారు. అన్నప్రసాదాన్ని 47.03 లక్షల మంది స్వీకరించారని, కల్యాణకట్టలో 10.72 లక్షల మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు.

రద్దీ నేపథ్యంలో లడ్డూ ప్రసాదాన్ని ఒక్కరోజు పరిమితంగా అందించామని, ప్రస్తుతం భక్తులకు 5.5 లక్షల లడ్డూలు అందుబాటులో ఉన్నాయని.. కోరినన్ని అందిస్తామని చెప్పారు.

నేటి నుంచి అందుబాటులో జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు.. శ్రీవారి ఉత్సవమూర్తులకు మూడురోజులపాటు(ఈ నెల 12 నుంచి 14 వరకు) జరగనున్న జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు శనివారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. రోజుకు 600 టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. ఒక్కో టికెట్‌ ధర రూ.400గా నిర్ణయించారు.

సీఆర్వో కార్యాలయానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భక్తుల ఆధార్‌ వివరాలు, బయోమెట్రిక్‌ తీసుకుని టికెట్లు జారీ చేస్తారు. సేవకు ఒక రోజు ముందుగా మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన మంజూరు చేస్తారు. సేవ అనంతరం భక్తులను మహా లఘు దర్శనానికి అనుమతిస్తారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.