తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో రష్యన్లు సందడి చేశారు. 25 మంది రష్యన్లు స్వామి వారిని దర్శించుకుని రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం రాహు కేతు పూజలు నిర్వహించారు. స్వామి వారితో పాటుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను, శ్రీకాళహస్తి శివాలయం విశిష్టతను రష్యా భక్తులు కొనియాడారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని రష్యన్లు తెలిపారు.
ఇవీ చదవండి: