ETV Bharat / city

శ్రీవారి దర్శనానికి భక్తుల అవస్థలు, 50 మందితో బ్రేక్ దర్శనానికి వెళ్లిన మంత్రి - minister usha sri charan break darshan

minister usha sri charan
minister usha sri charan
author img

By

Published : Aug 15, 2022, 12:34 PM IST

Updated : Aug 15, 2022, 1:25 PM IST

12:30 August 15

మంత్రి ఉషశ్రీ చరణ్ పై భక్తుల ఆగ్రహం

తిరుమలలో గడిచిన వారం రోజుల నుంచీ భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. దీంతో.. స్వామి దర్శనానికి ఏకంగా 40 గంటలకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్ర మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడం గమనార్హం. ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనానికి వెళ్లారు మంత్రి.

అక్కడి అధికారులు పరిస్థితి వివరించినా.. వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించారు మంత్రి. మరో పది మంది అనుచరుల వరకు సుప్రభాత సేవా టికెట్లు సైతం ఇప్పించారు. మంత్రి వ్యవహార శైలిపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే.. మంత్రి మధ్యలో వచ్చి, వెంట జనాన్ని తీసుకొచ్చి, బ్రేక్ దర్శనాల పేరుతో దర్శనం చేసుకొని వెళ్లిపోతారా? అని మండి పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను తోసుకుని మంత్రి ఉష శ్రీచరణ్ వెళ్లిపోవడం గమనార్హం.

వాస్తవానికి తిరుమలలో గడిచిన వారం రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన తితిదే.. భక్తులకు సూచనలు చేసింది. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పింది. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తున్నందున భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపింది. అధిక రద్దీ దృష్ట్యా.. వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.

అంతేకాకుండా భక్తుల రద్దీ దృష్ట్యా.. ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలతోపాటు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిఫారసు లేఖలతోపాటు.. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల ప్రత్యేక దర్శనాలను సైతం రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సైతం మంత్రి అనుచరులతో బ్రేక్ దర్శనానికి వెళ్లడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు నిండి శ్రీవారి సేవాసదన్ వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. దీంతో.. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అప్రమత్తమైన తితిదే అధికారులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నారు. కిలోమీటర్ల మేర విస్తరించిన క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా.. అన్నప్రసాదాల పంపిణీ చేపట్టారు.

Last Updated : Aug 15, 2022, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.