తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఛత్తీస్గడ్ నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలుడు శివం కుమార్ సాహు ఫిబ్రవరి 27న అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఛత్తీస్గడ్ నుంచి వచ్చిన కుటుంబం అలిపిరి బాలాజీ బస్టాండ్లో సేదతీరుతుండగా బాలుడు అపహరణకు గురయ్యాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుడి ఊహా చిత్రాన్ని ఇవాళ పోలీసులు విడుదల చేశారు. బాలుడి సమాచారం తెలిస్తే తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 80999 99977 నెంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. బాలుడి ఆచూకీ కోసం తిరుపతి అర్బన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
ఇదీచదవండి