Rayalaseema Sabha : రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలకూ సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రమైన ప్రణాళికలతో కొత్త చట్టం రూపొందించాలని రాయలసీమ అభివృద్ధి ఐక్య కార్యాచరణ సంఘం డిమాండ్ చేసింది. తిరుపతిలోని ఇందిరా మైదానంలో రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో.. "అభివృద్ధి వికేంద్రీకరణ - రాయలసీమ మనోగతం" పేరుతో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు రాయలసీమ మేధావులు, పలు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వనరులున్నా రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ఏర్పాట్లు జరగకపోవడం వల్ల వెనుకబడిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు రాజధానుల చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాగా.. సభకు వచ్చిన మెప్మా మహిళలు, విద్యార్ధులు సభ జరుగుతున్న సమయంలోనే వెళ్లిపోయారు.
ఇదీ చదవండి : Liquor Rates Reduced in AP: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు