తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానన్న సింధు.. యువత క్రీడల వైపు వచ్చేలా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకుని కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
స్వామి వారి సేవలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి..
తిరుమల శ్రీవారిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. మాతృభాషలోనే పాలన సాగేలా కృషి చేస్తున్నామని.. ఇలా జరిగితే ప్రభుత్వం అమలు చేసే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతాయన్నారు.
ఇదీ చదవండి: