ETV Bharat / city

'ప్రజల్లో రావాలి చైతన్యం.. లేకుంటే సంక్షోభం తీవ్రతరం' - ఏపీ కొవిడ్ వార్తలు

పౌర స్పృహతో కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని వైద్యరంగ నిపుణులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాల సూచనలను విధిగా పాటించాలని చెబుతున్నారు. లేదంటే సంక్షోభం మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.

corona
corona
author img

By

Published : Jul 25, 2020, 2:45 PM IST

ఈటీవీ భారత్​తో సామాజిక కార్యకర్త, వైద్యులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ భారీగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినప్పటికీ చాలా మంది ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడం లేదన్నది వాస్తవం. దీనికి నిర్లక్ష్యం ఓ కారణమైతే.. ప్రభుత్వాలు పెడుతున్న ఆంక్షలు, అమలు చేస్తున్న నిబంధనలు తమ హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న భావన మరొక కారణమని చెబుతున్నారు వైద్యరంగ నిపుణులు, సామాజిక కార్యకర్తలు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే కరోనాను ఆపడం కష్టసాధ్యమని చెబుతున్నారు. పౌర స్పృహతోనే వైరస్ ఉద్ధృతి తగ్గుతుందని అంటున్నారు.

అయితే కేవలం మూడు సూత్రాలు పాటిస్తే కరోనా మన దరిచేరదని చెబుతున్నారు వైద్యరంగ నిపుణులు. అవి

1. మాస్కు ధరించడం

ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టినప్పటి నుంచి మరలా తిరిగి ఇంటికి చేరే వరకు మాస్కు విధిగా ధరించాలి. మధ్యమధ్యలో దానికి తాకడం కానీ, తీయడం కానీ చేయొద్దు.

2. సామాజిక దూరం

బయటకు తిరిగేటప్పుడు సామాజిక దూరం పాటించాలి. మనిషికి మనిషికి మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండాలి. రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.

3.శుభ్రత

బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆఫీసులో ఉన్నప్పుడు కనీసం మూడు గంటలకొకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి.

ఇదీ చదవండి

ముఖ్యమంత్రికి కరోనా- ప్రభుత్వాసుపత్రిలో చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.