ఎవరూ ఒత్తిడికి గురికాకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎన్నికల సిబ్బందిని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లాలోని నాయుడుపేట జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏర్పాట్లు, ఓటింగ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు.
ఇదీ చదవండి: