ETV Bharat / city

sai teja dead body: బెంగళూరులోనే సాయితేజ పార్థీవదేహం.. రేపు అంత్యక్రియలు - సాయితేజ మృతదేహం

Lance Naik Sai Teja : సాయితేజ అంత్యక్రియలు మరింత ఆలస్యం కానున్నాయి. మృతదేహం గుర్తించినప్పటికీ స్వగ్రామానికి రావడానికి ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది.

సాయితేజ మృతదేహం గుర్తింపు
సాయితేజ మృతదేహం గుర్తింపు
author img

By

Published : Dec 11, 2021, 8:58 AM IST

Updated : Dec 11, 2021, 2:57 PM IST

Lance Naik Sai Teja: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ మృతదేహం స్వస్థలానికి చేరుకునేందుకు ఇంకా ఆలస్యమవుతోంది. రేపు ఉదయం వరకు బెంగళూరులోనే సాయితేజ భౌతికకాయం ఉండనుంది. రేపు సాయితేజ మృతదేహం స్వగ్రామం ఎగువరేగడికి చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించామన్న ఆర్మీ అధికారులు.. విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నట్లు వెల్లడించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రావత్​ను మెప్పించిన సాయితేజ
helicopter crash: దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో..అహోరాత్రులు శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి..త్రిదళపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు. రావత్ భద్రతా బృందంలో చోటు సంపాదించారు. అతడే లాన్స్ నాయక్ సాయితేజ. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఈ తెలుగుతేజం.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.

మంత్రుల పరామర్శ
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబ సభ్యులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయంగా కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. విధి నిర్వహణలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమే అయినా... దేశ సేవలో అమరుడు కావడం గర్వ కారణమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ఎగువరేగడలో విషాదఛాయలు
Lance naik in helicopter crash: లాన్స్ నాయక్ సాయితేజ అకాల మరణం..అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన సాయితేజ... ఆకస్మికంగా తనువు చాలించడం.. అందరినీ కలచివేసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉంటూ.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అనుకోని ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర విషాదంలోకి నెట్టందని కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

sai teja joined as jawan:2012లో ఆర్మీ సిపాయిగా చేరిన సాయితేజ...కొంతకాలం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారాకమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని పారాకమాండో అయ్యారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టికరిపించే ట్రూపర్‌గా...నైపుణ్యం సాధించారు. కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చేస్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే సాయితేజలోని సామర్థ్యాన్ని గుర్తించిన రావత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. సాయితేజకు ఐదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. రావత్ కు వ్యక్తిగత సిబ్బందిగా చేరాక సాయితేజ దిల్లీలోనే ఉంటున్నారు. ఏడాది క్రితం తన కుటుంబాన్ని మదనపల్లెకి మార్చారు. ఈ ఏడాది వినాయక చవితికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కొద్దిసేపటికే సాయి మరణవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సాయితేజ మృతి అతని స్వగ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. యువకెరటం మృతి ఎంతో బాధాకరమని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 11, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.