చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు.. చంద్రగిరి మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఫలితంగా.. తినడానికి ఆహారం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. మూలపల్లి గ్రామానికి హెలీకాప్టర్ ద్వారా నిత్యావసర వస్తువులు(Essential goods distribution with helicopter) అందించారు.
అనంతరం.. కల్యాణి డ్యామ్, మూలపల్లి చెరువును పరిశీలించారు. మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి సూచించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో వరద ప్రభావిత ప్రాంతాలను(Flood Effected Areas in Madanapalle) సీపీఐ నేత రామకృష్ణ పరిశీలించారు. పట్టణంలో సరైన నీటి ప్రణాళిక లేకపోవడంతో వాన నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిందని అన్నారు. ప్రజలకు శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి నిర్మించ తలపెట్టిన జలాశయాలను తక్షణమే పూర్తిచేసి ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీచదవండి.