పేరూరు చెరువు.. పరిసర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువుకు గండి కొడితే పాతకాల్వతోపాటు దిగువన ఉన్న గ్రామాలు నీట మునుగుతాయి. గండి కొట్టకపోతే తిరుపతి వైపు వరద మళ్లుతుంది. ఈ పరిస్థితుల నడుమ అధికారులు అనివార్యంగా పేరూరు చెరువు(peruru lake in Tirupati)కు గండి కొట్టి నీటిని పాతకాల్వ వైపు మళ్లించారు.
దీంతో.. గొల్లపల్లి, రామానుజపల్లి, చిగురువాడ వైఎస్ఆర్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పేరూరు చెరువు గండిని మూసేయాలంటూ పాతకాల్వ గ్రామస్థులు ఆందోళన చేశారు. 4 రోజులుగా తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నామని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీచదవండి.