వైకాపా ఎంపీలు 22 మంది ఉన్నప్పటికీ పార్లమెంటులో ఇప్పటివరకు చేసిందేమీ లేదని తిరుపతి పార్లమెంట్ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ఎంపీలు ఇప్పటివరకు పార్లమెంటులో గళం విప్పిన దాఖలాలు లేవన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా.. అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని దుయ్యబట్టారు.
దైవసాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలోనే ప్రకటించిన భాజపా.. తర్వాత కాలంలో మాట తప్పిందని విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతామన్నారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ సమావేశం..బహిష్కరించిన ప్రతిపక్షాలు