ETV Bharat / city

నేడు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2021-22 వార్షిక బడ్జెట్, వివిధ విభాగాలల్లో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీ, తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతోపాటు పలు అంశాలు చర్చించనున్నట్లు సమాచారం.

రేపు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం
రేపు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం
author img

By

Published : Feb 26, 2021, 10:51 PM IST

Updated : Feb 27, 2021, 4:23 AM IST

నేడు తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రధాన అజెండాగా జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. గత ఏడాది 3309 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ రూపొందించగా కరోనా ప్రభావంతో అంచనాలు పూర్తిగా మారిపోయాయి. వివిధ మార్గాల ద్వారా సమకూరే ఆదాయానికి గండిపడింది. ఈ నేపథ్యంలో 2020-21 ఏడాదికి సవరించిన బడ్జెట్‌-2021-22ను పూర్తిస్థాయి ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. తితిదే నగదును సప్తగిరి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్‌ చేయడం, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలా.. వద్దా... ? అనే అంశాలపై చర్చించనున్నారు.

వడమాలపేట సమీపంలో తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఈ సమావేశం ఆమోదం తెలపనుంది. తిరుమల వివిధ విభాగంలో శాశ్వత ప్రాతిపదిక, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదిక ఉద్యోగాల నియామకంపై చర్చించనున్నారు. తితిదే భద్రతా విభాగంలో 300 మంది మాజీ సైనికులను తీసుకునే అంశంపై చర్చించనున్నారు. తితిదే ఆధ్వర్యంలో కల్యాణోత్సవాల నిర్వహణ, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు కొంత మంది సభ్యులు నేరుగా పాల్గొననుండగా.. మిగిలినవారంతా ఆన్‌లైన్‌ ద్వారా సమావేశానికి హాజరుకానున్నారు.

ఇదీచదవండి:

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Last Updated : Feb 27, 2021, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.