ETV Bharat / city

రాళ్లదాడి ఘటనపై ఎలాంటి ఆధారాలు లభించలేదు: డీఐజీ - No evidence found on the cbn stone attack incident latest news

చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను పరిశీలించినా తమకు ఆధారాలు లభించలేదన్నారు. ఫిర్యాదు చేసిన తెదేపా నాయకులను ఆధారాలను సమర్పించాలని కోరామని..ఈ విషయమై చంద్రబాబుకి నోటీసు ఇచ్చామని తెలిపారు.

No evidence found on the cbn stone attack incident
రాళ్లదాడి ఘటనపై ఎలాంటి ఆధారాలు లభించలేదు
author img

By

Published : Apr 13, 2021, 6:31 PM IST

రాళ్లదాడి ఘటనపై ఎలాంటి ఆధారాలు లభించలేదు

చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. పోలీసులపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. ఎన్నికలను సజావుగా నడిపించటానికి పోలీసులు శ్రమిస్తున్నారని... పోలీసులను నిందించటం సబబు కాదని అన్నారు.

"రాళ్ల దాడిపై సమాచారం ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు ఇచ్చాం. ఆధారాలు ఇవ్వాలని కోరాం. దాడిపై ఆధారాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన తెదేపా నేతలనూ కోరాం. ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మా విచారణలో కనిపించలేదు. రాళ్లు తగిలాయని ఇద్దరు కార్యకర్తలు చెప్పారు. చంద్రబాబు సభలో రాళ్ల దాడి ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశాం. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించాం, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించాం. దాడి ఘటనపై మాత్రం ఎలాంటి ఆధారాలు లభించలేదు. చంద్రబాబు భద్రతా సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలను ప్రశ్నించాం. చంద్రబాబు వాహన శ్రేణిని పరిశీలించాం. సభను అడ్డుకోవాలని దాడి చేసినట్లు ఆధారాలు లభించలేదు."- డీఐజీ కాంతి రాణా

ఇదీచదవండి

సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు..రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.