MLA ROJA MET MUNICIPAL MINISTER BOTCHA SATYANARAYANA: మున్సిపల్ శాఖ మంత్రి సత్యనారాయణను నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడలో కలిశారు. తన నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లోని సమస్యలను ఆమె మంత్రికి వివరించారు. నగరిలో నిర్మాణం జరుగుతున్న జగనన్న అర్బన్ హౌసింగ్ కాలనీ పనుల పురోగతి వివరాలనూ వెల్లడించారు.
ప్రధానంగా.. పుత్తూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితిని వివరించిన రోజా.. దాని పునఃనిర్మాణానికి నిధులు అందించాలని కోరారు. అందుకోసం రూ.9 కోట్ల అంచనా వ్యయంతో తయారు చేసిన ప్రతిపాదనను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు సమర్పించారు. అదే విధంగా.. నగరి, పుత్తూరు మున్సిపాలిటీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని మున్సిపల్ మంత్రిని కోరారు. ఎమ్మెల్యే వివరించిన సమస్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడలోని స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ (రహదారులు మరియు భవనాల శాఖ) ఐఏఎస్ అధికారి కృష్ణబాబును కలిసి నగరి నియోజకవర్గ పరిధిలోని రోడ్ల దుస్థితిపై వినతి పత్రం అందించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో "నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా" చేపట్టిన రోడ్డు పనులు అద్వానంగా ఉన్నాయని.. ఇటీవలి వర్షాలకు దెబ్బతిందని పేర్కొన్నారు. దీనిపై కృష్ణబాబు స్పందిస్తూ.. ఈ హైవే మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ.. అది తమిళనాడు హైవే అధికారుల పరిధిలో ఉన్నందున విషయం తమ దృష్టికి రాలేదన్నారు. హైవే ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
SomiReddy On Amaravathi Corporation : భూములు తాకట్టు పెట్టడానికే.. అమరావతి కార్పొరేషన్ : సోమిరెడ్డి