తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటర్నింగ్ అధికారి నుంచి పోలింగ్ సిబ్బంది వరకూ అందరినీ దూరంపెట్టి పారదర్శకంగా రీ పోలింగ్ నిర్వహించాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రిగ్గింగ్ చేసేందుకు సహకరించిన సిబ్బందిపై, ఎన్నికల అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ ఓట్లు వేసినవారిని, వేసేందుకు ప్రయత్నించిన వారిని వీడియోల ద్వారా గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అప్రజాస్వామిక రీతిలో జరిగిన తిరుపతి పోలింగ్‌పై భాజపాతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు.
ఉన్నతాధికారులు, పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకారంతో వైకాపా నేతలు వ్యవస్థీకృతంగా రిగ్గింగ్‌కు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేయించడం కూడా సీఎం జగన్ నవరత్నాల్లో భాగం అనుకోవాలా? అని మనోహర్ ప్రశ్నించారు.
ఇదీచదవండి