పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలకు లైట్, మోనో ట్రైన్ ఏర్పాట్లపై ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో అనాథ, వికలాంగ పిల్లలకు తిరుమల శ్రీవారి దర్శనం చేయించిన సందర్భంగా వారికి స్వామివారి ప్రసాదాలు ఛైర్మన్ అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. లైట్ మెట్రో ప్రతిపాదనలపై సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో చర్చించామన్న ఆయన... సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక సమర్పించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. రోడ్డుపై వెళ్లే మోనో ట్రైన్, ట్రామ్ రైల్ తరహా ఏర్పాట్లకే మొగ్గుచూపుతామన్న ఛైర్మన్... తీగలపై నడిచే క్యాబ్, రోప్ ట్రైన్ల జోలికి వెళ్లటం లేదన్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మోనో రైల్, లైట్ మెట్రో దోహదం చేస్తుందన్న ఆయన... దీనిపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఆగమ పండితులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.
ఇదీ చూడండి: