తిరుమల శ్రీవారిని మంత్రి శంకర్ నారాయణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం