నేతన్నల సంక్షేమం కోసం వారికి ఆర్థికంగా చేయూతనందించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన... పథకం అమలు చేయాల్సిన తీరుపై అధికారులతో చర్చించారు. చేనేత వృత్తిని వదులుకుని పొట్టకూటి కోసం వలస పోయిన నేతన్నలను ఈ పథకం ఆదుకుంటుందని పెద్దిరెడ్డి అన్నారు. బెంగుళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలసపోయిన నేత పనివారంతా తిరిగి గ్రామాలకు రావాలని మంత్రి కోరారు. వారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతన్నలను ఆదుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వివిధ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 5లక్షల వరకూ డబ్బులు అందుతున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ చలవే. - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి
ఇవీ చదవండి...