జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు పెంచే బాధ్యత పూర్తిగా సర్పంచ్‌లదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నాటిన వాటిలో 80 శాతం మొక్కలు బతకకపోతే.. సర్పంచ్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ హరినారాయణన్, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఇదీచదవండి
అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజాసేవే ప్రధాన అజెండా: చంద్రబాబు