హైదబారాబాద్ను తలదన్నే రాజధానిగా విశాఖ
బీసీజీని ఓ పనికిమాలిన నివేదికగా చంద్రబాబు అభివర్ణించటాన్ని బొత్స తప్పుబట్టారు. కేవలం సచివాలయం అమరావతి నుంచి తరలిస్తుంటే ఉద్యోగులు, రైతులను రెచ్చగొట్టటం సబబు కాదన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా...అమరావతి టౌన్ షిప్ నిర్మాణం పూర్తికాదన్న మంత్రి... నిధులన్నీ అమరావతికే ఖర్చు పెడితే ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. కేవలం 10 వేల కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిగా విశాఖ మారుతుందని జోస్యంచెప్పారు.
ఆయన్ను నమ్మితే నట్టేట మునుగుతారు
చంద్రబాబును నమ్మితే నట్టేట మునిగిపోతారనే నానుడికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అన్న బొత్స.. వోక్స్ వ్యాగన్ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడనే చోస్టన్ అనే వ్యక్తిని నమ్మి గతంలో వోక్స్ వ్యాగన్ కోసం ఎంవోయూ కుదుర్చుకున్నామన్న ఆయన.. చివరికి అతను మోసం చేయటం వలన నాలుగేళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నానన్నారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టపోతుందనే ఆందోళనతో చంద్రబాబు భాష రోజురోజుకూ దిగజారుతోందని బొత్స విమర్శించారు. చంద్రబాబు బీపీ పెరిగిపోతుంటే టాబ్లెట్ వేసుకుని ఇంట్లో కూర్చోవాలంటూ మండిపడ్డారు.
ఎక్కడా 130 అడుగులు తవ్వకాలు అనవసరం
దేశంలో... సొంత రాష్ట్రంలో ఇల్లులేని నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని మంత్రి బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు నగరాల జనాభా పైనా అవగాహన లేదన్నారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రాకూడదనే నాడు జగన్ మౌనం వహించారన్న మంత్రి... అమరావతిలా ఎక్కడా భవన నిర్మాణ పునాదుల కోసం 130 అడుగులు తవ్వాల్సిన అవసరం లేదన్నారు. సచివాలయం మార్పు మినహా... రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే అవాస్తవాలను రైతులు నమ్మొద్దన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడకుండా ఉండాలని రైతులకు హితవుపలికారు.
ఇదీ చదవండి :