తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: 2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి: డీడీఆర్‌పీ ఛైర్మన్