తిరుమల శ్రీవారికి అలంకరించే మేల్ ఛాట్ వస్త్రాలను జూన్ నెల వరకు సరిపడా సమకూర్చినట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టెండర్‌లో తక్కువ కోట్ చేసిన సేలంలోని తయారీదారుల నుంచి మేల్‌ఛాట్ వస్త్రాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. స్వామివారి మూలమూర్తికి అలంకరించేందుకు ప్రత్యేక కొలతలతో ఈ వస్తాలను తయారుచేస్తారని చెప్పారు. సేలంలో మాత్రమే మేల్‌ఛాట్ వస్త్రాలను తయారుచేస్తారని, తయారీదారులు ఎంతో నియమనిష్టలతో ఈ పట్టువస్త్రాన్ని రూపొందిస్తారని తెలిపారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు ఉండడంతో సేలంలో సిద్ధమైన 8 మేల్‌ఛాట్ వస్త్రాలను తిరుమలకు తీసుకురావడం కష్టంగా మారిందని ధర్మారెడ్డి తెలిపారు. బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి చొరవ తీసుకుని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అనుమతులు తీసుకుని సేలం నుంచి.. ఈ వస్త్రాలను తిరుమలకు తీసుకొచ్చారని చెప్పారు.
ఇదీ చదవండి : మద్యం దుకాణాలు తెరవటంపై మహిళాగ్రహం