కరోనా విజృంభణ దృష్ట్యా ఆగస్టు 5 వరకు తిరుపతిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని మొత్తం కేసుల్లో 30 శాతం తిరుపతిలోనే నమోదయ్యాయని.. కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి.. పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. అనుమతిచ్చిన సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. జిల్లాలో ప్రధాన నగరమైన తిరుపతిలోనే రోజుకు రెండు వందలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి..
రాష్ట ప్రభుత్వ భద్రత వద్దు.. కేంద్ర బలగాలతో కావాలి: రఘురామకృష్ణరాజు