తిరుపతి విమానాశ్రయం వద్ద లాంజ్ నిర్మాణం కోసం భూకేటాయింపునకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. లాంజ్ నిర్మాణం కోసం 1800 చదరపు మీటర్ల భూమిని కేటాయించారు. ఏడాదికి రూపాయి లైసైన్స్ ఫీజుతో 15 ఏళ్లకు కేటాయించారు. ఏపీ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌కు భూకేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లాంజ్ ఏపీఈడబ్లూఐడీసీ నిర్వహించనుంది.
లాంజ్ ఉపయోగాలు
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వీఐపీలు, వీవీఐపీలు తరచూ వస్తుంటారు... లాంజ్ నిర్మిస్తే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించవచ్చు.