ETV Bharat / city

Garuda Bridge: గరుడ వారధికి నిధుల కొరత.. నత్తనడకన పనులు

author img

By

Published : Jun 10, 2022, 10:18 AM IST

Srinivasa setu: తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చడానికి చేపట్టిన గరుడ వారధి నిర్మాణానికి నిధుల కొరత వెంటాడుతుంది. పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ... నామమాత్రంగా నిధులు విడుదల చేయడంతో... వారధి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. వెరసీ నగర వాసులకి, భక్తులకి ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు.

Srinivasa setu
గరుడ వారధి
గరుడ వారధి

Srinivasa setu: తిరుపతి నగరవాసులతో పాటు.. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించడానికి.. మూడేళ్ల క్రితం గురుడవారధి నిర్మాణాలు చేపట్టారు. స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పేరుతో తిరుచానూరు మార్కెట్‌ యార్డు నుంచి.. కపిలతీర్థం సమీపంలోని నంది కూడలి వరకు.. గరుడ వారధి నిర్మిస్తున్నారు. తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌, తితిదే సంయుక్తంగా 684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. 6 కిలోమీటర్ల మేర గరుడ వారధి నిర్మాణాలు చేపట్టాయి.

గరుడ వారధి నిర్మాణాల కోసం 458 కోట్ల రూపాయలు తితిదే, 226 కోట్ల రూపాయలు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ వ్యయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తితిదే నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతుండటం వల్ల గరుడ వారధి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం వంతెన నిర్మాణాలు ప్రారంభమైనా.. నేటికీ ఓ కొలిక్కి రాలేదు. తితిదే తమ వాటా నుంచి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాత్రం.. నిధులను మొత్తం మళ్లించి.. గరుడ వారధి నిర్మాణాలు ఆగకుండా కొనసాగిస్తోంది.

తిరుచానూరు మార్కెట్‌ యార్డు సమీపం నుంచి చేపట్టిన నిర్మాణాలు.. నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. మార్కెట్‌ యార్డు నుంచి బస్టాండ్‌ వరకు పనులు అంతంతమాత్రంగా సాగుతుండగా.. బస్టాండ్‌ కూడలి నుంచి కపిలతీర్థం వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. బస్టాండ్‌ కూడలి నుంచి కపిలతీర్థం వరకు పనులు పూర్తవగా.. మిగిలిన ప్రాంతంలో ప్రారంభ దశలో ఉన్నాయి.

మంగళం ప్రాంతం నుంచి లీలామహల్‌ కూడలి, రేణిగుంట రహదారి నుంచి రామనుజం కూడలి, మార్కెట్‌ యార్డు నుంచి రామానుజం కూడలి వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రామానుజం కూడలి నుంచి బస్టాండ్‌ వరకు పనులు ప్రారంభం కాలేదు. బస్టాండ్‌ సమీపంలో వారధిపై కూడలి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోవడంతో నగరవాసులు, శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

గరుడ వారధి నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు విడుదల చేయాలని గత ఏడాది ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసినా.. నిధులు విడుదల కాలేదు. నగరపాలక అధికారులు విధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.