"ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో ఉన్నవారు మంత్రులా.. కంత్రులా" అని జనసేన నేత రాయల్ కిరణ్ ప్రశ్నించారు. సీఎం సహా మంత్రులంతా.. ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ను దూషిస్తేనే.. మంత్రుల ఫైళ్లపై జగన్ సంతకం చేస్తున్నారా? అని నిలదీశారు. ప్రజలను కాపు కాయాల్సింది పోయి.. జగన్‌ను కాపు కాస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే నైతిక అర్హత మంత్రులు అమర్నాథ్, అంబటి రాంబాబుకు లేదని అన్నారు. మంత్రులు మరోసారి పవన్ విషయంలో తీవ్రపదజాలంతో మాట్లాడితే.. వారికన్నా తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Mahesh: "పవన్ కౌలు రైతుల భరోసా యాత్రతో... వైకాపాకు భయం పట్టుకుంది"