ETV Bharat / city

జాబిల్లిపై గెలుపే లక్ష్యంగా.. చంద్రయాన్​-3 ప్రయోగం

author img

By

Published : Feb 16, 2020, 5:05 AM IST

Updated : Feb 16, 2020, 6:59 AM IST

భవిష్యత్​లో సౌరకుటుంబంలో చేపట్టే ప్రయోగాలకు చంద్రుడిని ప్రయోగ స్థావరంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఇస్రో స్పేస్ సైన్స్ ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీకుమార్. తిరుపతిలో ఐసర్​ వేదికగా జరుగుతోన్న ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్ ఇండియా 38వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాబిల్లిపై చంద్రయాన్​ ​- 3ని ప్రయోగించటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ISRO Space Science Program Director Sreekumar attending 38th meeting of the Astronomical Society of India in thirupathi
జాబిల్లిపై గెలుపే లక్ష్యంగా.. చంద్రయాన్​-3 ప్రయోగం
జాబిల్లిపై గెలుపే లక్ష్యంగా.. చంద్రయాన్​-3 ప్రయోగం
జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్​ను సురక్షితంగా దింపటమే లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కృషి చేస్తున్నట్లు ఇస్రో స్పేస్ సైన్స్ ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీకుమార్ అన్నారు. తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - ఐసర్ వేదికగా జరుగుతోన్న ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్ ఇండియా 38వ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ మిషన్ ద్వారా ఇస్రో చేస్తున్న ప్రయోగాలను విద్యార్థులకు వివరించారు. చంద్రయాన్ - 2 విఫలమైన చోటే.. గెలుపే లక్ష్యంగా చంద్రయాన్ - 3ని ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. 2024లో ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న చంద్రయాన్-3లో జపాన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం - జాక్సా పలు అంశాల్లో భాగస్వామ్యం అవుతున్నట్లు వివరించారు. భవిష్యత్​లో సౌరకుటుంబంలో చేపట్టే ప్రయోగాలకు చంద్రుణ్ని ప్రయోగ స్థావరంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించనున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ్యాన్, రోవర్ విఫలమైనా.. ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ ప్రయోగాలకు ఉపయోగపడే విధంగా ఫోటోలను తీసి అందిస్తోందంటూ.. వాటిని విద్యార్థులకు చూపించారు.

ఇదీ చదవండి:

ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన...

Last Updated : Feb 16, 2020, 6:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.