ETV Bharat / city

తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి 40 గంటలు - తిరుమల

Tirumala వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్​మెంట్లు నిండి బయటి వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటలు పడుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

tirumala
tirumala
author img

By

Published : Aug 14, 2022, 1:14 PM IST

Updated : Aug 14, 2022, 9:07 PM IST

Heavy rush to Tirumala: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు నిండి శ్రీవారి సేవాసదన్ వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అప్రమత్తమైన తితిదే అధికారులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నారు. కిలోమీటర్ల మేర విస్తరించిన క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా.. అన్నప్రసాదాల పంపిణీ చేపట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలతోపాటు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సిఫారసు లేఖలతోపాటు.. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.

తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి 36 గంటలు

Tirumala: ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే తెలిపింది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని కోరింది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.

వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు వరుస సెలవులు ఆగస్టు 19 వరకు ఉన్నాయి. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమలకు యాత్రీకుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావాలని తితిదే విజ్ఞప్తి చేసింది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపింది. యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత, ఓపికతో రావాలని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 14, 2022, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.