ETV Bharat / city

శోకసంద్రంలో మునిగిన హాసినీ స్నేహితులు - hasini tirupati boat accident

చెరగని చిరునవ్వుతో.....తిరిగి వస్తుందనుకున్న చిన్నారి హాసినీ పాపికొండల పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో తిరుపతిలో పెనువిషాదం నెలకొంది.

తిరుపతి బోటు ప్రమాదం హాసిని
author img

By

Published : Sep 17, 2019, 2:36 PM IST

తిరుపతికి చెందిన హాసినీ చనిపోయిందన్న వార్త విని ఆమె తల్లి మధులత గుండెలు అవిసేలా రోదిస్తుండగా... చిన్నారి తండ్రి సుబ్రహ్మణ్యం ఆచూకీ ఇప్పటికి తెలియలేదు. ఈ పరిస్థితుల్లో హాసినీ చదువుకుంటున్న తిరుపతి స్ప్రింగ్ డేల్ పాఠశాలలో సహచర విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గల్లంతైన సమాచారం తెలిసినప్పటికి హాసినీ... తన తండ్రితో క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించిన తోటి విద్యార్థులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

హాసినీకి ఘననివాళులు అర్పించిన స్నేహితులు

ఇదీ చూడండి

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు: కోడెల కుమార్తె

Intro:ప్రతి ఒక్క రు సేవా దృక్పథం అలవర్చుకోవాలి..

చిత్తూరు జిల్లా కలికిరిలోని 15వ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్ ) బెటాలియన్ కేంద్రంలో బిఎస్ఎఫ్ అధికారులు జవాన్లు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బి ఎస్ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ విశాల్ రానా ప్రారంభించారు. ఇటీవల స్థానిక బిఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్ కుమార్ జోషి తీవ్ర జ్వరానికి గురై తిరుపతి సీఎం సి హాస్పిటల్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సమయంలో ఆసుపత్రిని సందర్శించిన బిఎస్ఎఫ్ అధికారులకు ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు రక్తం లేనట్లుగా అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సమాజానికి తమవంతు సాయంగా ఉచిత రక్తం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు . ప్రమాదాల్లో గాయపడి రక్తం చాలక పలువురు మరణిస్తున్నారని, గర్భవతుల శస్త్రచికిత్సలకు అవసరమైనప్పుడు రక్తం సరిపోవడం లేదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి బిఎస్ఎఫ్ బెటాలియన్ లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. 50 మంది జవాన్లు ఒక్కొక్కరు 350 ఎంఎల్ చొప్పున రక్తాన్ని ఇచ్చారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ , మదనపల్లె రక్తనిధి కేంద్రం వైద్యులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్లు మహేష్ , మునాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని సేకరించి రక్తనిధి కేంద్రానికి తరలించారు. యువకులు సామాజిక సేవా దృక్పథంతో రక్తాన్ని ఇవ్వాలని వైద్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.

వాయిస్ బిఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ విశాల్ రానా

పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్

Body:ఉచిత రక్తదాన శిబిరం

Conclusion:చిత్తూరు జిల్లా కలికిరి బిఎస్ఎఫ్ బెటాలియన్ కేంద్రంలో అధికారులు జవాన్లు ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు 50 మంది వరకు ఇందులో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.