ETV Bharat / city

హనుమంతుడు పుట్టింది.. తిరుమలగిరులలోనే..! - హన్మంతుడి జన్మస్థలం తిరుమలగిరుల్లో న్యూస్

హనుమంతుడు పుట్టింది.. తిరుమలగిరులలోనే..!

author img

By

Published : Apr 8, 2021, 3:41 PM IST

Updated : Apr 8, 2021, 7:13 PM IST

15:38 April 08

తిరుమల సప్తగిరులలో ఒకటైన అంజనాద్రిని హ‌నుమంతుని జ‌న్మ‌స్థానంగా తితిదే ప్రకటించనుంది. పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌ను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుప‌తిలోని తితిదే ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి అంజనాద్రిపై ఏర్పాటు చేసిన  అధ్యయన క‌మిటీ స‌భ్యుల‌తో స‌మీక్ష నిర్వహించారు. క‌మిటీలోని పండితులు జ్యోతిష్య శాస్త్రం, శాస‌నాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాల‌తో ఉగాది నాడు ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని ఆయన సూచించారు. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇత‌ర వివ‌రాల‌తో స‌మ‌గ్ర‌మైన పుస్త‌కాన్ని ముద్రించాలని ఆదేశించారు.

అంజ‌నాద్రి కొండ‌లో హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో నిరూపించేందుకు గత ఏడాది డిసెంబ‌రులో పండితుల‌తో తితిదే ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి స‌న్నిధానం సుదర్శ‌న‌శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త  రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ సహాయ సంచాలకులు విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా.. ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శివ‌, బ్ర‌హ్మ‌, బ్ర‌హ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్ ‌సంహిత గ్రంథాల పరిశీలించిన అధ్యయన కమిటీ అంజ‌నాద్రి.. ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థాన‌మ‌ని నిర్ధారించినట్లు ప్రకటనలో  తితిదే వివరించింది.

ఇదీ చదవండి:

లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..?

Last Updated : Apr 8, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.