వేదాల్లోని సారాన్ని సామాన్యులకు చేరవేసేలా పరిశోధనలు విస్తృతం కావాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభిలషించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయంలో నిర్వహించిన 5వ స్నాతకోత్సవానికి ఆయన కేంద్రమంత్రి ప్రతాప్ చంద్రసారంగితో కలిసి హాజరయ్యారు. వేద విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులై అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్, కేంద్రమంత్రి సారంగి పట్టాలు, పతకాలను ప్రదానం చేశారు. సంస్కృత విద్యలో నిపుణుడైన కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగికి శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం తరపున వాచస్పతి బహుమతి ప్రదానం చేశారు.
సనాతన భారతీయ సంప్రదాయాల సౌరభాలాన్నీ వేదాల్లోనే నిబిడీకృతమై ఉన్నాయని గవర్నర్ అన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు విస్తృత స్థాయిలో పరిశోధనలు జరపటం ద్వారా వాటిని జనబాహుళ్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇటీవలి కాలంలో జరుగుతున్న రాద్ధాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రాథమిక హక్కుల కోసం ఎంత వరకైనా పోరాటం సాగించవచ్చన్న బిశ్వభూషణ్.. అదే సమయంలో ప్రాథమిక విధులను నెరవేర్చటాన్ని భావితరాలు బాధ్యతగా తీసుకోవాలని సందేశమిచ్చారు.
ఇదీ చదవండి: