Flower decoration at TTD: శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఫల, పుష్ప అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఎనిమిది టన్నుల పూలు, ఫలాలను వినియోగించి అలంకరణలు చేపట్టారు. ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, సంప్రదాయ పుష్పాలతో ముస్తాబు చేశారు. ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణ ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవధాన్యాలతో చేసిన శ్రీమహావిష్ణువు, శ్రీరాముడి దృశ్యాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన వివిధ ఘట్టాలు భక్తులనువిశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: Ugadi celebrations at TTD: తిరుమలలో ఉగాది వేడుకలు.. ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహణ