ETV Bharat / city

అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలి: సుగుణమ్మ - ex mla sugunamma agitation for vaccination to people

కరోనా వ్యాక్సిన్లను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతిలో నిరసన చేపట్టారు. వ్యాక్సిన్​ తీసుకునేందుకు వచ్చి.. నిరాశగా వెనుదిరుగుతున్న వారితో ఆమె మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వలంటూ మాజీ మహిళా ఎమ్మెల్యే నిరసన
author img

By

Published : May 9, 2021, 7:52 PM IST

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన వ్యాక్సిన్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని తెదేపా మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో ఆర్కే డీలక్స్ సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట ప్లకార్డులతో ఆమె నిరసనకు దిగారు.

వాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నా.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎంత ఎదురుచూసినా.. వ్యాక్సిన్ కోసం కేంద్రాలకు వచ్చేవారికి నిరాశే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

మళ్లీ కళకళలాడుతున్న టిబెటన్​​ 'తివాచీ'లు

అమ్మతనంలోని గొప్పతనాన్ని చాటిన మాతృమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.