ETV Bharat / city

సంక్షోభంలో పాలించడం వారికి తెలియడం లేదు : చింతా మోహన్ - ప్రభుత్వాలపై చింతా మోహన్ విమర్శలు

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు సంక్షోభంలో ఎలా పాలించాలో తెలియడం లేదని ఆరోపించారు.

ex central minister chinta allegations on governments
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆగ్రహం
author img

By

Published : May 12, 2021, 11:57 PM IST

కొవ్వొత్తుల ప్రదర్శన, పళ్లాలు మోగించడం బదులు..ప్రాణవాయువు ఇచ్చి ఉంటే పరిస్థితులు బాగుండేవని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ.. రుయాలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మోతాదుకు మించి కరోనా బాధితులను చేర్చుకోవడం, అనుభవం లేని అడ్మినిస్ట్రేషన్ వల్ల.. దాదాపు 40 మంది ఆక్సిజన్ లేక అరగంటలో మరణించడం బాధ కలిగించిందన్నారు.

తితిదే పాలక మండలి ధర్మకర్తలు దొంగ ఓట్లు వేయించడంలో చూపించిన శ్రద్ధ, ఆంజనేయ స్వామికి జన్మ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో చూపిన చొరవ.. తిరుపతిలో ఆసుపత్రులకు ఆక్సిజన్ అందజేయడంలో చూపితే ఎంతో మంచి పేరు వచ్చి ఉండేదన్నారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో సీఎం జగన్ విఫలమయ్యారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై చర్యలు ఆపి.. కరోనా వ్యాధిపై దాడి చేయడం మంచిదని హితవు పలికారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ జగన్‌కు..సంక్షోభంలో ఎలా పరిపాలించాలో తెలియడం లేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టిన దీపంలాగా మార్చడం దారుణమన్నారు.

ఇదీ చదవండి :

రుయా ఘటన: 'ప్రభుత్వ లెక్కలు తప్పు.. ఇవిగో ఆధారాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.