Elephants On Ghat Road: తిరుమల కనుమ దారిలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద అవి రహదారిపైకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది తిరిగి వాటిని అడవిలోకి పంపించారు.
గతంలోనూ ఇదే ప్రాంతంలో ఏనుగులు చాలాసార్లు రహదారిపైకి వచ్చాయి. భక్తులకు ఎటువంటి ప్రమాదమూ జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Suspension Order Revoked: నాడు హడావిడిగా విచారణ.. సస్పెన్షన్.. ఇప్పుడు ఎత్తివేత..!