తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రుయా ఆస్పత్రి ద్వారం వద్ద పారిశుద్ద్య కార్మికుల బైఠాయించి ధర్నా నిర్వహించారు. అలిపిరి రోడ్డు నుంచి రూయా ఆస్పత్రి ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. కాంట్రాక్ట్ సంస్ధకు, సూపరింటెండెంట్‌కు పలుమార్లు ఆర్జీలు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ ఖాతా, ఐడీ కార్డ్స్, సకాలంలో జీతాలు చెల్లించాలని, పెరిగిన జీతాలను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన