తిరుమల తిరుపతి దేవస్థాం అదనపు ఈవో ధర్మారెడ్డి.... ఇంఛార్జి ఈవోగా ఆదివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళుతున్న అనిల్ కుమార్ సింఘాల్... తితిదే ఈవో బాధ్యతలను ధర్మారెడ్డికి అప్పగించారు.
అనంతరం సింఘాల్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. సింఘాల్‌కు తితిదే సిబ్బంది వీడ్కోలు పలికారు.
ఇదీ చదవండి: