Devotees rush to Tirumala తిరుమలలో మూడో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవన షెడ్లన్నీ నిండిపోయాయి. 3 కిలోమీటర్ల పైగా క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉన్నారు. పెరటాసి మాసం కావడంతో.. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. రద్దీ దృష్ట్యా రాత్రి దర్శనానికి వచ్చే భక్తులను ఉదయం రావాల్సిందిగా తితిదే కోరింది. రాత్రి క్యూలైనులోకి వెళ్లిన భక్తులను నారాయణగిరి షెడ్లులో నుంచి వైకుంఠ కాంప్లెక్స్ లోకి అనుమతించారు. ఇవాళ ఉదయం కూడా రద్దీ అధికంగా ఉండడంతో.. గోగర్భం జలాశయం నుంచి భక్తులను క్యూలైనులోకి అనుమతించారు. భక్తులకు అల్పాహారం, పాలు, నీరు తితిదే సిబ్బంది అందజేస్తున్నారు. ఈ రద్దీ ఇంకా రెండ్రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలు ముగిసినా తిరుమలలో రద్దీ పెరిగిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఉదయం మధ్యాహ్నం గోగర్భం జలాశయం వద్ద నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. క్యూలైన్లలో వెళ్లే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులను తితిదే కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
'' బ్రహ్మోత్సవాలను ఈవో ధర్మారెడ్డి విజయవంతంగా పూర్తిచేశారు. పెరటాసి మాసం,వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు . వైకుంఠ కాంప్లెక్స్ లు నుంచి క్యూలైన్లు బయటికి వస్తే భక్తులల్లో అసంతృప్తి ఉంటుందని,క్యూలైన్లు బయటికి వచ్చిన సరే తితిదే అధికారులు అన్ని వసతులను భక్తులకు కల్పిస్తున్నారు. తితిదే ఈవో శక్తికి మించి పనిచేస్తున్నారు''- తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఇవీ చదవండి: