Crowd in Tirumala: శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతం కావడంతో.. కలియుగ దైవం దర్శన టోకెన్ల కోసం బారులు తీరారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు రద్దీగా మారాయి. క్యూలైన్లు నిండిపోయాయి. రేపటి దర్శనం కోసం ఇచ్చే టికెట్లకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో భక్తులు అధికసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. వాహనాల తనిఖీ ఆలస్యం కావడంతో.. భక్తులకు నీరీక్షణ తప్పడం లేదు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి.
Fire Accident in TTD Free Bus: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న తితిదే ఉచిత బస్సు(ధర్మ రథం)లో తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే బస్సును పక్కకు నిలిపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజన్లో మంటలు వచ్చినట్లు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. మరో ఘటనలో.. తిరుమల శ్రీవారి పాదాల దారిలో ఆర్టీసీ బస్సును-టెంపో వాహనం ఢీకొనడంతో కర్ణాటకకు చెందిన భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.
ఇదీ చదవండి: Suicide: తిరుపతిలో విషాదం.. ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య