ETV Bharat / city

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య - TTD Latest news

తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా ప్రభావంతో కొన్ని నెలలపాటు నిర్మానుష్యంగా ఉన్న తిరుమల... అన్​లాక్‌ ప్రారంభమయ్యాక కొవిడ్‌ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించారు. క్రమంగా భక్తుల సంఖ్య పెంచుతూ వచ్చిన తితిదే అన్‌లాక్‌ 5.O ప్రారంభం కావడంతో దర్శనాల టికెట్ల కేటాయింపు మరింత పెంచింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 19 వేల టికెట్లను జారీ చేస్తున్న తితిదే.. మూడు వేల మందికి సర్వదర్శనం అవకాశం కల్పిస్తోంది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్‌, సుపథం ప్రవేశం వంటి... శ్రీవారిని దర్శించుకొనే వారి సంఖ్య 25 వేలకు చేరింది.

devotees-coming-to-tirumala-in-unlock-5-dot-0
తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య
author img

By

Published : Nov 1, 2020, 5:45 PM IST

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య

తిరుమల శ్రీవారిని దర్శించుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్‌లాక్‌ 5.O నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొనేందుకు మరింత మందికి అవకాశం కల్పిస్తూ తితిదే చర్యలు చేపడుతోంది. ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం, సుపథం, శ్రీవాని ట్రస్ట్‌ ఇలా వివిధ మార్గాల్లో శ్రీవారిని దర్శించుకొనేందుకు తితిదే వీలు కల్పిస్తోంది. దీంతో శ్రీవారిని దర్శించుకొనే వారిసంఖ్య దాదాపుగా పాతికవేలకు చేరింది.

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత రోజుకు ఆరు వేల మందితో దర్శనాలు ప్రారంభించిన తితిదే.. క్రమంగా సంఖ్య పెంచుతూ పాతికవేలకు చేర్చింది. దీంతో కరోనా ప్రభావంతో మార్చి నుంచి జూన్‌ వరకు దాదాపు మూడు నెలల పాటు నిర్మానుష్యంగా ఉన్న తిరుమల ఇపుడు భక్తజన సంచారంతో సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది.

అధిక మాసం రావడంతో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన తితిదే ఉత్సవాలు ముగియడంతో... నవంబర్‌ నెల నుంచి దర్శనాల కోటాను భారీగా పెందించింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేసిన దేవస్థానం... రోజుకు 19 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. నవంబర్‌ నెలలో ఐదు లక్షల డెబ్బైవేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా మూడు రోజుల్లోనే నాలుగు లక్షలా తొంబైమూడు వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు.

మరోవైపు... ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు, తితిదే బోర్డు సభ్యుల కోటా, ఛైర్మన్‌ కార్యాలయం టిక్కెట్లను జారీ చేస్తోంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌ వద్ద రోజుకు 3 వేల సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల తరహాలోనే సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో జారీచేయాలని భక్తులు కోరుతున్నారు.

సర్వదర్శనం టోకెన్ల కోసం తరలివస్తున్న భక్తులు... నిరసనలు, తోపులాటలకు దిగుతుండటంతో తితిదే పునరాలోచనలో పడింది. భూదేవి కాంప్లెక్స్‌ వద్ద జారీ చేసే టికెట్ల కేటాయింపు విధానాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకొంది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు అవకాశం ఉండటం... తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీచేసే ప్రాంతంలో పరిస్థితులు చేయిదాటుతుండటంతో తితిదే సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.