ప్రభుత్వ పాలన, ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన జరిగినపుడే... అమ్మభాష పదికాలాలు మనగలుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త, అవధాని డాక్టర్ మేడసాని మోహన్ నిర్వహిస్తున్న సంపూర్ణ శతావధానం కార్యక్రమాన్ని... తొలి ప్రశ్న అడిగి ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయ సత్సంగ్ ఆధ్వర్యంలో జూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల నుంచి సాహిత్యాభిమానులు పాల్గొని ప్రశ్నలు అడిగారు.
ఇదీ చదవండీ... 'లేఖ' వివాదం: ఏజీకి అశ్వినీ కుమార్ మరో ఉత్తరం