ETV Bharat / city

TTD : తితిదే ధనప్రసాదం... భక్తుల నుంచి విశేష స్పందన - TTD dhanaprasadam

తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన ధన ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొంతమంది భక్తులు కరోనా నేపథ్యంలో తిరుమలకు రాలేకపోతున్నామని తమకు కూడా ధన ప్రసాదాన్ని తపాలా ద్వారా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నాణేలు తితిదే వద్ద నిల్వ పేరుకుపోవడంతో తిరుమల వసతిగృహాల్లో బసచేసిన భక్తులకు తిరిగి చెల్లించే కాషన్‌ డిపాజిట్‌కు సమానమైన చిల్లర నాణేలను ధన ప్రసాదంగా తితిదే అందచేస్తోంది.

తితిదే ధనప్రసాదం
తితిదే ధనప్రసాదం
author img

By

Published : Sep 23, 2021, 3:31 AM IST

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్లో చిల్లర నాణేలను భక్తులకు తిరిగి అందచేస్తూ ధన ప్రసాదం పేరుతో తితిదే సరికొత్త పథకం అమలు చేస్తోంది. శ్రీవారికి సమర్పించిన కానుకలు మహా ప్రసాదంగా భక్తులు భావిస్తుండటంతో ధన ప్రసాదానికి మంచి స్పందన లభిస్తోంది. శ్రీవారికి రోజు ఐదు లక్షల రూపాయల విలువైన చిల్లర నాణేలు హుండీ ద్వారా సమకూరుతున్నాయి. భక్తులు సమర్పించిన నాణేలను గతంలో బ్యాంకులకు తరలించి నగదు రూపంలో మార్చుకునేవారు. అయితే తితిదే అధికారులు శ్రీవారి హుండీలో వేసిన ధనాన్ని ప్రసాదం రూపంలో భక్తులకు అందచేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి హుండీలో వేసిన నాణేలను ఇంట్లో ఉండటం శుభకరంగా భక్తులు విశ్వసిస్తారని భావించిన తితిదే ప్రసాదం కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది.

శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చే భక్తులు గదులను తీసుకునే సమయంలో ముందస్తు ధరావత్తు కింద కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. తిరిగి వెళ్లిపోయే ముందు భక్తులు చెల్లించిన ధరావత్తు సొమ్మును సిబ్బంది తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. ఈ తిరిగే సొమ్మును కాగితాల రూపంలో కాకుండా ధన ప్రసాదంగా చిల్లర డబ్బులను తిరిగి చెల్లిస్తున్నారు. నగదుతోపాటు అమ్మవారి కుంకుమ, అక్షింతలు కలిపి ఇవ్వడంతో భక్తులు స్వామివారి ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరిస్తున్నారు. ధన ప్రసాదం వద్దనుకొనే భక్తులకు తితిదే నోట్లను అందచేస్తోంది. అయితే కరోనా భయంతో తిరుమలకు రాలేక పోతున్న భక్తులు కొంత మంది తపాలా ద్వారా ధన ప్రసాద నాణేలను అందచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీచదవండి.

పాఠశాలపై మక్కువ... అదే విద్యాలయంలో తాత,తండ్రి,కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.