ETV Bharat / city

తిరుపతిలో కరోనా ఉద్ధృతి...రికార్డు స్థాయిలో కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 3 రోజుల పాటు రోజూ 200 పైగా కేసులు నమోదవగా.. శనివారం రికార్డుస్థాయిలో 300 మందికి వైరస్‌ సోకింది. కొత్త కేసుల్లో సగంపైగా కేసులు తిరుపతి నగర, గ్రామీణ పరిధిలోనే వెలుగు చూశాయి. కొవిడ్‌ ఆసుపత్రితో పాటు...నగర శివార్లలో కొవిడ్ కేర్‌, క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రభావం తిరుపతిపై తీవ్రంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తిరుపతిలో కరోనా ఉద్ధృతి...రికార్డు స్థాయిలో కేసులు
తిరుపతిలో కరోనా ఉద్ధృతి...రికార్డు స్థాయిలో కేసులు
author img

By

Published : Jul 12, 2020, 3:48 AM IST

Updated : Jul 12, 2020, 6:01 AM IST

తిరుపతిలో కరోనా ఉద్ధృతి...రికార్డు స్థాయిలో కేసులు

లాక్‌డౌన్‌ సడలింపు...తిరుమల శ్రీవారి దర్శనాలు ప్రారంభం....పొరుగు రాష్ట్రం తమిళనాడులో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు కారణాలతో చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 3100కు చేరింది. కొత్త కేసుల్లో తిరుపతి నగరంలో 144, తిరుపతి గ్రామీణంలో 24, నగరిలో 16, పుత్తూరులో 12, ఏర్పేడు, మదనపల్లిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా ప్రభావం జిల్లా తూర్పు ప్రాంతాల్లో ఉండగా...ఇప్పుడు పశ్చిమ ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1592 మంది రోగులు చికిత్స పొందుతుండగా...19 మంది మృతిచెందారు.

44 వార్డుల్లో కంటైన్​మెంట్​ జోన్లు

తిరుపతి నగరంలో ఇప్పటివరకూ 600 కేసులు నమోదయ్యాయి. నగరంలో 44 వార్డులు కంటైన్‌మెంట్‌ జోన్‌ల పరిధిలో ఉన్నాయి. జిల్లాలో అధికంగా తిరుపతి పరిధిలోనే ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నందున అధికారులు మరిన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ ఆసుపత్రి, తిరుమల శ్రీవారి దర్శనాల ప్రారంభం వంటి కారణాలతో తిరుపతిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దుకాణాలను తెరిచే వేళలు కుదించే విషయంపై సంబంధిత వ్యక్తులతో అధికారులు చర్చిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు వస్తున్న వ్యక్తుల కాంటాక్ట్‌లను గుర్తించి నమూనాలు సేకరించడం....హోమ్‌ క్వారంటైన్‌ పంపడం వంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

తితిదే ఉద్యోగుల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తిరుమలలో పనిచేస్తున్న ఓ అర్చకుడితో పాటు 92 మంది ఉద్యోగులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి : కరోనా కలకలం: అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్​కు!

Last Updated : Jul 12, 2020, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.