పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న తమను తితిదే ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో విలీనం చేయాలని కోరుతూ ఒప్పంద కార్మికులు నిరసన చేపట్టారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే టైంస్కేల్ ఇస్తామన్న హమీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని(Demand to solve problems) డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.