రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన తిరుపతి రుయా ఆసుపత్రి దుర్ఘటనలో మృతుల వివరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రకటించారు. ఈ నెల 10న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. వారి వివరాలను కలెక్టర్ అధికారికంగా వెల్లడించారు.
మృతుల కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన బాధిత కుటుంబసభ్యులకు పరిహారం సంబంధిత జిల్లాల కలెక్టర్లు అందిస్తారన్నారు.
మృతుల వివరాలు
1. షాహిత్ (27) వరదయ్యపాలెం, చిత్తూరు జిల్లా
2.బాబు (55) తిరుపతి
3. భువనేశ్వర్ బాబు (36) చిత్తూరు
4. రాజమ్మ (71) నెల్లూరు జిల్లా
5. మునీర్ (49) గుర్రంకొండ, చిత్తూరు జిల్లా
6. దేవేంద్ర (58) యర్రావారిపాలెం, చిత్తూరు జిల్లా
7. ఫజీలుల్లా (41) కలికిరి, చిత్తూరు జిల్లా
8. వెంకటసుబ్బయ్య (28) రాజంపేట (కడప జిల్లా)
9. తనూజరాణి (48) గాజులమండ్యం, చిత్తూరు జిల్లా
10. గౌస్ బాష (37) పుంగనూరు, చిత్తూరు జిల్లా
11. మహమ్మద్ బాషా (49) తిరుపతి
ఇదీ చదవండి: