జగన్ బెయిల్ రద్దు చేయాలని.. తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన చింతా మోహన్ అన్నారు. బెయిల్ షరతులను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. జగన్‌పై వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో బంగారు లక్ష్మణ్‌ను జైలుకు పంపారన్నారు. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహ నిందితులైన అధికారులకు పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు బయటి నుంచి వచ్చిన చాలా మందికి కరోనా సోకిందని ఆరోపించారు. పోలింగ్, ఫలితాలకు మధ్య ఇన్ని రోజుల వ్యత్యాసమెందుకని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: దేవినేని