ETV Bharat / city

గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయమన్న సీజేఐ - తిరుపతి జిల్లా తాజా వార్తలు

CJI Justice NV Ramana జాతిపిత మహాత్మాగాంధీ వారసులుగా మనం ఉండటం గర్వకారణమని.. దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గాంధీ ఆత్మకథ చదవాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు. గాంధీ ఆత్మకథను సత్యశోధన పేరుతో తిరుపతి శాసనసభ్యుడు కరుణాకరరెడ్డి.. ముద్రించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి రెండు రోజుల తిరుపతి పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

16142135
16142135
author img

By

Published : Aug 19, 2022, 2:57 PM IST

Updated : Aug 20, 2022, 8:16 AM IST

Satyasodhana సత్యశోధన పుస్తకావిష్కరణ: అహింసా మార్గంలో సత్యం, ధర్మాన్ని పాటిస్తూ స్వతంత్రం, హక్కుల కోసం ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి గాంధీజీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. సామాన్యుడి నుంచి మహాత్ముడిగా ఆయన పరిణామం చెందిన విధానం సత్యశోధన పుస్తకంలో ఉందన్నారు. గాంధీజీ వారసులుగా మనందరం గర్వించాలన్నారు. గాంధీజీ రాసిన సత్యశోధన (తెలుగు అనువాదం) పునర్ముద్రిత ప్రతిని శుక్రవారం తిరుపతిలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి రాజకీయ నేత చదవాల్సిన మొదటి పుస్తకం ఇదే. చరిత్ర, ఆత్మకథలు చాలావరకు అతిశయోక్తులతో, సత్యదూరంగా ఉంటాయి. గాంధీజీ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా రాశారు. ఈ పుస్తకాన్ని తిరిగి ప్రచురించడం ఎంతో సంతోషం. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా ముందుకొచ్చి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. గాంధీ గురించి తెలియని భారతీయుడు ఉండరు. ఆయన స్వతంత్రం తేవడమే కాదు.. సమాజంలో అహింస, శాంతి మార్గాల ద్వారా నిజాయతీగా జీవితాన్ని గడపడం ఎలా అనేది బోధించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినా అవన్నీ హింసాత్మక వాతావరణంలో చోటుచేసుకున్నాయి. ఎటువంటి రక్తపాతం లేకుండా గాంధీజీ అహింస అనే ఆయుధంతో సాగించిన ఉద్యమం భారతదేశ స్వతంత్ర సంగ్రామం. హింస, ద్వేషం, మత కలహాలు లేకుండా ప్రశాంత జీవితాన్ని గడపాలనే గాంధీ శాంతి సందేశం సమాజానికి ఎంతో అవసరం. ఈనాటి యువతరం ప్రత్యేకించి మన జీవన విధానంలో వచ్చిన మార్పులు, బతుకుతెరువు కోసం సాగించే విద్యా విధానంలో గాంధీ గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఒకసారి ఆ మహాత్ముడి గురించి ఆలోచించాలన్న స్ఫూర్తిని ఈ పుస్తకం ద్వారా కలగజేశారు. గాంధీకి సంబంధించిన అనేక ఇతర రచనలను సైతం ప్రచురించే బాధ్యతలు కరుణాకర్‌రెడ్డి చేపడతారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు..

CJI Justice NV Ramana: ‘ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం కష్టమైంది. చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కరుణాకర్‌రెడ్డి తాను చేసిన తప్పును ఒప్పుకొన్నాడంటే ఆయన్ను ఏ విధంగా చూడాలో, గౌరవించాలో చెప్పడానికి మాటల్లేవు. ఎంతో గొప్ప మనస్సుతో.. పరివర్తన చెందిన మానవతావాదిగా కరుణాకర్‌రెడ్డి రుజువు చేసుకున్నారు. విద్యార్థి దశలోనే వామపక్షాల వైపు మళ్లారు. నేను కూడా అంత స్థాయిలో కాకున్నా రాజకీయభావాల పట్ల ఆకర్షితుణ్నయ్యాను. కరుణాకర్‌రెడ్డి ఎమర్జెన్సీలో రెండేళ్లు జైల్లో ఉన్న అతి పిన్న వయస్కుడు. అనేకమంది రాజకీయ నేతలు, సాహితీవేత్తలు, గౌతు లచ్చన్న వంటి దిగ్గజాల సాన్నిహిత్యంతో ఆయనలో మార్పు వచ్చింది. ఆయన ఈ రాజకీయాల్లో ఎలా మనుగడ సాగిస్తున్నారో అని నాకు ఆశ్చర్యం వేసేది. 2011లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. నేను న్యాయమూర్తిగా ఉన్నా. కరుణాకర్‌రెడ్డి ఒకరోజు నా దగ్గరకొచ్చి తిరుపతి పట్టణంలో ఏ వీధి చూసినా మద్యం దుకాణాలు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. నేనేం చేయాలో అర్థంకావడం లేదని ఓ పిల్‌ వేశారు. ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడైనా ఆశయ సాధన కోసం పనిచేసిన ధైర్యశాలి. ఈరోజు ఆయన అధికార పార్టీ సభ్యుడైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడం సామాన్య విషయం కాదు. దురదృష్టవశాత్తు ఇవాళ ఉన్న రాజకీయ పార్టీ కానీ అంతకుముందు ఉన్న పార్టీ కానీ ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. విశాల దృక్పథంతో పార్టీ, రాజకీయాలకు అతీతంగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే మంచి లక్షణాలు ఉన్న నేతను ఈ రాజకీయ పార్టీలు ఉన్నత స్థానంలో ఎందుకు ఉంచవో నాకు అర్థం కాలేదు. ముక్కుసూటిగా మాట్లాడటం, నిర్మొహమాటంగా ఉండటం వంటి విషయాలు నచ్చవేమో! ప్రజల కోసం కరుణాకర్‌రెడ్డి సేవలు వినియోగించుకుంటారని అనుకుంటున్నా. తద్వారా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు మేలు చేసిన వారవుతారు. ఆయన నా దగ్గరకొచ్చిన ప్రతి సందర్భంలో భాష, సాహిత్యం, దేశంలోని సమస్యలు, వాటి పరిష్కారం గురించి చర్చించేవారు. కొన్ని సందర్భాల్లో నాపై ఎవరైనా దుష్ప్రచారం చేయించేందుకు ప్రయత్నించినా, విమర్శించినా ఆయన సహించేవారు కాదు. దాని మూలంగా ఆయనకు వచ్చే అవకాశాలు పోతాయి, కొంతమందికి శత్రువు అవుతాడని తెలిసీ నిర్మొహమాటంగా వెల్లడించి నా తరఫున నిలబడిన వ్యక్తి. సొంత సోదరుడి కన్నా ఎక్కువ. రాజకీయాలు అంటే అసహ్యించుకునే పరిస్థితి నుంచి.. మంచి రాజకీయాల వైపు మళ్లించే ఉద్యమానికి కరుణాకర్‌రెడ్డే నాయకుడు కావాలి’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిప్రాయపడ్డారు.

తప్పులకు క్షమాపణ కోరుతున్నా: కరుణాకర్‌రెడ్డి

నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి అన్నారు. పతనం చెందిన మానవుడికి అధికారం వస్తే చేయగలిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రకృతిలో సంపద కావాల్సినంత ఉంది.. కానీ మానవుడి అత్యాశే మింగేస్తోంది. మనం సంపదకు కాపలాదారులమే తప్ప హక్కుదారులం కాదని గొప్ప నిర్వచనం ఇచ్చిన వ్యక్తి బాపూజీ. ఆయన నినాదాలను మాత్రమే వాడుకుని.. ఆచరణను మరిచిపోవడం ఈ తరం చేస్తున్న పాపం. తీవ్రవాద రాజకీయాల వల్ల ప్రభావితుణ్నై, గాంధీ పట్ల అసహనంతో కూడిన ఆలోచనలున్న వ్యక్తిగా 1975లో నేను ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నప్పుడు గౌతు లచ్చన్న నాకు ఈ (సత్యశోధన) పుస్తకం ఇచ్చారు. మానవ జాతిలోనే శిఖరాగ్ర పురుషుడు గాంధీజీ. రాజకీయాలు ప్రాపంచిక క్రీడ, సాధువులు చేసేది కాదని గాంధీజీకి తిలక్‌ ఉత్తరం రాస్తే.. ఆధ్యాత్మిక జీవనం కొనసాగించే వాళ్లు రాజకీయాలు చేయకుంటే బాధ్యతారాహిత్యాన్ని, అలసత్వాన్ని పెంచి పోషించినట్లేనని ఆయన ప్రత్యుత్తరం పంపారు. మార్క్సిజం గమ్యాన్ని గురించి మాట్లాడితే.. గాంధీజీ గమనాన్ని గురించి మాట్లాడారు. బుద్ధుడి తర్వాత మానవ విలువలు, దాని అవసరాలను నిర్వచించిన వ్యక్తి గాంధీజీ. గాంధీ జీవితం స్వాతంత్య్ర పోరాటంలో కంటే మన తరానికే ఎక్కువ అవసరం. ఆనాడు తీవ్రవాద రాజకీయాల ద్వారా జరిగిన నేరాలకు, ప్రజాస్వామ్య రాజకీయాల్లో జరిగిన అపచారాలకు చేసిన తప్పులకు భారత ప్రధాన న్యాయమూర్తి ముందు నిందితుడిగా చేతులు కట్టుకుని నిలబడి క్షమాపణలు కోరుకుంటున్నా. రాజకీయాల్లో మార్పు రాకుంటే మానవజాతి మనుగడకే ప్రమాదం. పెరిగిన జనాభాకు తగినంత సంపద ఉన్నా మనకున్న అత్యాశ వల్ల ఆ సంపద సరిపోని స్థితికి చేరుకోవడం చాలా పాపం. నా తమ్ముడు ధర్మారెడ్డి నేడు తితిదే ఈవోగా ఉన్నారు. 2006లో ఇద్దరు దుర్మార్గుల వల్ల నేను అతి పెద్ద తప్పిదం చేసి, నా తమ్ముడికి తీరని అన్యాయం చేశా. అతని ఔదార్యం నన్ను ఇప్పటికీ అన్నగానే భావిస్తోంది. ఈ సభ సాక్షిగా ధర్మారెడ్డికి క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. ఆచరణలో గాంధీ జీవితాన్ని ఆలస్యంగా తెలుసుకున్నా.. పదవుల కంటే వ్యక్తిగత నైతిక జీవితం గొప్పదని భావించిన వ్యక్తిని’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తితిదే ఈవో ధర్మారెడ్డి, రచయిత సాకం నాగరాజ, తితిదే విశ్రాంత అధికారి శైలకుమార్‌, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

సేవాసమాజ నిర్మాత గుత్తా మునిరత్నం అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొనియాడారు. తిరుపతిలోని రాష్ట్రీయ సేవాసమితి (రాస్‌) ప్రధాన కార్యాలయంలో పద్మశ్రీ డాక్టర్‌ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల దార్శనిక వైఖరి ప్రదర్శించి వర్తమాన సమాజానికి ఆదర్శంగా నిలిచిన మానవతాకేతనం మునిరత్నం అని ప్రశంసించారు. తిరుపతి కేంద్రంగా ఎందరో అభాగ్యులు, పేదలు, అనాథలకు ఆయన అండగా నిలిచారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న, సన్నకారు రైతులకు రాస్‌ ద్వారా ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో తితిదే ఈవో ధర్మారెడ్డి, మాజీ జేఈవో శ్రీనివాసరాజు, రాస్‌ అధ్యక్షుడు సుందర వడివేలు, ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం, సంయుక్త కార్యదర్శి మమత, కమిటీ సభ్యులు రాజశేఖర్‌ నాయుడు, బాలాజీ నాయుడు, మహేందర్‌ రెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, సమత, కృష్ణమూర్తి, బాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తితిదే విశ్రాంత అధికారి శైలకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 20, 2022, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.