CJI at tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకుంది. ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం తర్వాత 1.45 నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
బుధవారం.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐకి.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణను భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా కలిశారు.
ఇదీ చదవండి:
Tirumala Vaikunta Ekadasi: రేపు వైకుంఠ ఏకాదశి.. ముస్తాబైన తిరుమల